ధోనీకి తప్పిన ప్రాణాపాయం

ఢిల్లీ ద్వారకా హోటల్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ హజారే ట్రోఫీ సెమీ ఫైనల్ ఆడేందుకు ఈ హోటల్‌లో జార్ఖండ్ జట్టు సహా క్రికెటర్ ధోనీ బస చేశారు. అగ్నిప్రమాదం నుంచి ధోనీ సహా జార్ఖండ్ జట్టు సురక్షితంగా బయటపడింది. ఘటనాస్థలికి చేరుకున్న 30 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి.

క్రికెటర్లు సురక్షితంగా బయటపడటంతో హోటల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో బెంగాల్, జార్ఖండ్ మధ్య విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్ వాయిదా పడింది. ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో శనివారం మ్యాచ్ జరగనుంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో సుమారు 540 మంది ఉన్నారు. ఉదయం అల్పాహారం తీసుకున్న సమయంలో హోటల్‌లో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన తాము బయటకు పరుగులు తీశామని జార్ఖండ్ క్రికెట్ ప్లేయర్ తెలిపారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో తాము ఆందోళనకు గురయ్యామని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published.