గుండెపోటుకు చేపతో చెక్!

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే చేపలు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు, మూడుసార్లు చేపలకూర తినడం వల్ల గుండెపోటును అదుపులో ఉంచవచ్చంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు చేపమాంసం తరచూ తినడం వల్ల గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు. గుండెపోటు మాత్రమే కాదు.. మధుమేహం, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలకు కూడా చేప మాంసం మంచి పరిష్కారం. చేపలో ఉండే ఒమేగా-3 కంటిచూపును మెరుగుపరుస్తాయి. మధుమేహం వల్ల కలిగే దుష్పలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. టైప్-2 డయాబెటిస్‌లో బాధపడే వారు ఆయిలీ ఫిష్ తింటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట.!

Videos

Leave a Reply

Your email address will not be published.