స్మార్ట్‌ఫోన్లపై రూ. 10 వేల తగ్గింపు : ఫ్లిప్‌కార్ట్ పండగ షురూ

దసరా, దీపావళి రాకముందే ఈ కామర్స్ దిగ్గజాలు భారీ తగ్గింపులకు తెరలేపాయి. ఈ వరసలో ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపులను అందించేందుకు సిద్ధమైంది. ఏకంగా ఫోన్లపై రూ. 10 వేల తగ్గింపును షురూ చేసింది. అక్టోబర్ 2 నుంచి మొదలు కానున్న ఈ బిగ్ బిలియన్ డే సేల్ 6వ తేదీ వరకు సాగుతుంది. ఈ రోజుల్లో ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఆపర్లేంటో ఓ సారి చూద్దాం.

అసుస్ జెన్ ఫోన్ ఈ ఫోన్ పై భారీ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందించింది. రూ. 10 వేల తగ్గింపును ఇస్తోంది. రూ. 18999 విలువ గల ఈ ఫోన్ ను ఇప్పుడు 9999కే సొంతం చేసుకోవచ్చు.

లీకో లీ 2 ఇది కూడా తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. రూ. 11999 విలువ గల ఈ ఫోన్‌ను రూ. 10,499కే సొంతం చేసుకోవచ్చు.

లీకో లీ 1ఎస్ ఈకో ఈ ఫోన్ కూడా భారీ తగ్గింపు ధరలో లభిస్తోంది. రూ. 10 వేల విలువ గల ఈ ఫోన్ ఇప్పుడు రూ. 2 వేల డిస్కౌంట్ తో కేవలం రూ. 7999కే మీ సొంతం చేసుకోవచ్చు.

అడిషనల్ డిస్కౌంట్లు మీరు ఏవైనా రెండు స్మార్ట్ ఫోన్లు మీరు ఎక్సేంజ్ చేసుకున్నట్లయితే మీకు రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు తగ్గింపును అందిస్తోంది.

మోటో ఎక్స్ ప్లే 16 జిబి ,32 జిబి ఇంటర్నల్ మెమొరీ గల మోటో ఎక్స్ ప్లే ఎక్సేంచ్ ఆఫర్ తో మీరు కొనుగోలు చేసినట్లయితే రూ. 4500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Google Chromecast 2 రూ. 3399 విలువ గల ఈ సెట్ ఇప్పుడు రూ. 2999కే లభిస్తోంది.

స్పీకర్స్ రూ. 15 500 విలువ గల Altec Lansing speaker స్పీకర్స్ ని ఇప్పుడు మీరు రూ. 4999కే సొంతం చేసుకోవచ్చు.దీంతో పాటు రూ. 7990 విలువ గల JBL Flip 2 Speakerని మీరు రూ. 3999కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్‌బిఐ ఎస్‌బిఐ డెబిట్ ,క్రెడిట్ కార్ట్ హోల్డర్స్ కోసం ఫ్లిప్ కార్ట్ 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. వారు ఏ వస్తువుపైన అయినా 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *