మరిన్ని డిస్కౌంట్ ఆఫర్ల బాటలో ఫ్లిప్‌కార్ట్…

దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్లకు మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వడానికి వ్యూహాలు రచిస్తోంది. అమెరికా ప్రముఖ ఈ-కామర్స్ స్టార్టప్ జెట్.కామ్స్ స్మార్ట్ కార్ట్ ఆఫర్ చేసే సర్వీసుల ఆధారితంగా డిస్కౌంట్ ప్రైసింగ్ మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ మోడల్‌తో తమ ఫ్లాట్ఫామైపై  వినియోగదారులు బహుళ ఉత్పత్తులను(మల్టిపుల్ ఐటమ్స్‌ను) కొనుకునేలా ప్రోత్సహిస్తూ, డెలివరీ చార్జీలు పొదుపుచేసేందుకు వాటిని వన్ బాక్స్‌లోనే రవాణా చేయనుంది. ఈ నెల చివరి నుంచి ఈ సర్వీసులను ఫ్లిప్‌కార్ట్  ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
జెట్.కామ్ అందిస్తున్న ఈ స్మార్ట్కార్ట్ సర్వీసులు పట్టణ ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్ల డీల్స్‌లో వివిధ రకాలైన ఆఫర్లను ఆ కంపెనీ అందిస్తోంది. ఒకేసారి మల్టిపుల్ ఉత్పత్తులను వినియోగదారులు ఆర్డర్ చేసినప్పుడు వాటిని ఒకే షిప్మెంట్లో వినియోగదారులకు అందించి, ఉత్పత్తులకు ప్రతీసారి వేసే షిప్పింగ్ చార్జీలను జెట్.కామ్ పొదుపుచేస్తోంది. ఈ రకంగా ఇటు కంపెనీకి, అటు వినియోగదారులకు లబ్దిచేకూరుతుంది. ఇప్పటికే ఆ కంపెనీకి కనీసం రోజుకు 25వేల ఆర్డర్ల వరకు నమోదవుతాయి.
అయితే ఫ్లిప్‌కార్ట్ అందించే ఈ సర్వీసుల కొరియర్ ధరలు స్లాబ్ చార్జీల్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఎటువంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు. జెట్.కామ్ ప్రస్తుతం వాల్‌మార్ట్ ఆధీనంలో ఉంది. ఈ సంస్థను వాల్‌మార్ట్ 3.3 బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసింది. జెట్.కామ్‌ను కొనుగోలుచేసిన వాల్‌మార్టే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మైనార్టీ స్టాక్ కోసం కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.. వారి ఉమ్మడి ప్రత్యర్థి అమెజాన్‌కు పోటీగా సేవలందించడానికి ఈ ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నా సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్ ఆధీన సంస్థ జెట్.కామ్ అందిస్తున్న ఆఫర్ల ఆధారితంగా ఫ్లిప్‌కార్ట్ కూడా వినియోగదారులకు మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *