ఫోన్ తెచ్చిన డెలివరీ బాయ్ ను ఏం చేశాడంటే..

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ ను చంపేశాడు ఓ జిమ్ ట్రైనర్. బెంగళూరులోని ముదలపాల్యలో ఈ సంఘటన జరిగింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. వరుణ్ కుమార్ అనే యువకుడు జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ అంటే భలే ఇష్టం. చేతిలో డబ్బులేకపోయినా ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ అయిన ఫ్లిప్ కార్ట్ లో రూ.12వేల విలువైన స్మార్ట్ ఫోన్ బుక్ చేశాడు. చేతిలో డబ్బులు లేకపోవటంతో క్యాష్ ఆన్ డెలివరీ కింద ఆర్డర్ ఇచ్చాడు. ఈలోపు డబ్బు సర్దుబాటు కోసం ఇంట్లో తండ్రిని అడిగాడు వరుణ్. డబ్బులు ఇవ్వటానికి నిరాకరించాడు తండ్రి.

జీతం డబ్బుతో కొనుక్కోమని తిట్టాడు. ఈలోపు ఫోన్ ఆర్డర్ డెలివరీ అయ్యింది. కొరియర్ బాయ్ నందకుమార్ స్వామి సమాచారం ఇచ్చాడు. ఫోన్ ఎక్కడికి డెలివరీ చేయాలి.. డబ్బు రెడీ చేసుకోండి అని. చేతిలో డబ్బులు లేవు.. జేబులో మాత్రం స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. ఆలోచనకు తగ్గట్టుగానే నీచమైన ఆలోచన ఆలోచించాడు వరుణ్. కొరియర్ బాయ్ నందకుమార్ ను స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ బ్యాంక్ దగ్గరకు రావాలని చెప్పాడు. ఆ బ్యాంక్ దగ్గరకు వెళ్లిన డెలివరీ బాయ్ నందకుమార్ ను.. మాటలు కలిపి, మభ్యపెట్టి పక్కనే ఉన్న బిల్డింగ్ సెల్లార్ లోకి తీసుకెళ్లాడు. ఫోన్ ప్యాకింగ్ చూపించాలని కోరాడు. కంపెనీ నుంచి వచ్చిన ప్యాకింగ్ ను తీసి వరుణ్ చేతిలో పెట్టాడు కొరియర్ బాయ్. జేబులో నుంచి డబ్బులు తీస్తున్నాడు అనుకున్న నందకుమార్ షాక్ అయ్యాడు. కత్తి తీసుకుని ఇష్టానుసారం పొడిచాడు జిమ్ ట్రైనర్. డెలివరీ బ్యాగ్ లోని రెండు ఫోన్లు, 10వేల నగదుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ హత్య డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల టైంలో జరిగింది. మూడు రోజుల తర్వాత మర్డర్ మిస్టరీని చేధించారు పోలీసులు. నిందితుడు జిమ్ ట్రైనర్ వరుణ్ ను అరెస్ట్ చేసి.. ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *