ప్రకాశం బ్యారేజికి వరద…కలెక్టర్ ఆదేశం

ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులో ఇప్పటికే గరిష్ట స్థాయి నీటి మట్టం ఉండగా ఇన్‌ఫ్లో 76 వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 70 గేట్లను ఎత్తి 65 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఇలాగే కొనసాగితే రేపటికి నాలుగ లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ నదీ పరివాహక ప్రాంత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Videos