మాజీ కెప్టెన్లకు ఘన సన్మానం

టీమిండియా చరిత్రాత్మకమైన 500వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సందర్భంగా భారత మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించింది. కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు బీసీసీఐ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ మాజీ సారథులను జ్ఞాపికలతో సన్మానించింది. వెంగ్‌ సర్కార్‌, కపిల్‌ దేవ్‌, రవిశాస్త్రి, గంగూలీ, సచిన్‌ తెందుల్కర్‌, శ్రీకాంత్‌, అనిల్‌ కుంబ్లే, అజహరుద్దీన్‌, మహేంద్రసింగ్‌ ధోని తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్టు హోదా సంపాదించిన ఆరో జట్టుగా గుర్తింపు పొందిన భారత్.. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో తొలి టెస్టును ఆడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ భారత టెస్టు జట్టుకు 32 మంది కెప్టెన్లగా వ్యవహరించారు. భారత టెస్టు కెప్టెన్లలో సీకే నాయుడు మొదలుకొని, విరాట్ కోహ్లి వరకూ భారత టెస్టు జట్టుకు సారథులుగా చేశారు. ఇప్పటివరకూ  క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ 976 టెస్టు మ్యాచ్లతో తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 791 టెస్టు మ్యాచ్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత 500 టెస్టు మ్యాచ్ల మార్కును అందుకున్న జట్లలో వెస్టిండీస్(517), భారత్ లు ఉన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published.