టీ‌డి‌పి నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్‌ చేస్తున్నాప్పటికి ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. 1951 జులై 11నా చిత్తూరు జిల్లాలో ఆయన జన్మించారు. తిరుపతిలో ఎస్వీ వైద్య కళాశాలలో ఎం‌బి‌బి‌ఎస్ అభ్యసించిన ఆయన ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు.

కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం అపోలో ఆస్పత్రిలో శివప్రసాద్‌ను పరామర్శించారు. మరోవైపు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా శివప్రసాద్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన పలు చిత్రాల్లో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు.

Videos