3 రోజుల్లో 45 లక్షల వ్యూస్..సినిమా టీజరనుకుంటే పొరపాటే.

మూడురోజుల్లో 45 లక్షల వ్యూస్.. ఇంత భారీ స్థాయిలో ట్రెండ్ అవుతుందంటే సినిమా టీజరనుకుంటే మాత్రం పొరపాటే. బైకులను దొంగిలించే ఇద్దరు యువకులు ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చి విఫలయత్నం చేసిన ఈ దృశ్యం సిసిటివి లో రికార్డ్ అయింది. ఈ వీడియోకి మూడు రోజుల్లో 45 లక్షల వ్యూస్ దక్కడమంటే మామూలు విషయం కాదు.

ఇద్దరు యువకులు ఓ ఇంటి వద్దకు బైక్ దొంగిలించాడనికి వెళతారు. వారిలో ఒకడు బయట కాపలాగా ఉంటాడు. రెండో వాడు ఆ ఇంటి గేటు తెరచి లోనికి వెళ్తాడు. చప్పుడు లేకుండా బైక్ ని తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాడు. బైక్ ని బయటకు తీసుకుని వచ్చే క్రమంలో అది ఇంటి గేటు కు ఇరుక్కుని పోతుంది. గేటు పూర్తిగా తెరచి ఉండక పోవడంతో బైక్ గేటు మధ్యలో ఇరుక్కుని పోతుంది. బైక్ ని ఎంత లాగినా రాదు. దీనితో అతడు గేటుని తన్నినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంతో అప్రమత్తమైన ఇంటి యజమాని ఓ పెద్ద రాడ్డు లాంటి దానితో దొంగని తరుముతాడు. అతడు బైక్ ని అక్కడ వదిలి పారిపోతాడు. ఈ తతంగం మొత్తం సిసిటివి ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *