క్రికెటర్లపై సినిమాలు అవసరమా?: ఎంఎస్ ధోనీకి గౌతమ్ గంభీర్ షాక్

క్రికెటర్ల పైన సినిమాలు తీయవలసిన అవసరం ఏమిటని గౌతమ్ గంభీర్ అన్నాడు. ప్రముఖ క్రికెటర్, ట్వంటీ 20, వన్డె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడుతూ.. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప పనులు చేసిన వారు ఎందరో ఉన్నారని చెప్పారు. వారి పైన సినిమాలు తీయాలని సూచించాడు.

‘క్రికెటర్ల జీవితంపై సినిమాలు తీయడం అనే అంశంపై నాకు నమ్మకం లేదు. క్రికెటర్లతో పోలిస్తే దేశానికి ఎంతో ఎక్కువ సేవలు చేసినవారిపై సినిమా అవసరం. భారత జాతి కోసం గొప్ప పనులు చేసినవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు. తీస్తే అలాంటివారి జీవితంపై సినిమాలు తీయాలి’ అని గంభీర్ నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించాడు.
 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *