నెత్తుటి క్రీడ: ఎన్నో హత్యలు.. మరెన్నో ఘోరాలు చేసిన “నయీమ్”

రెండున్నర దశాబ్దాలు నెత్తుటేర్లు పారించిన రాక్షసక్రీడ ముగిసిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల అండతో పేట్రేగిపోయిన మాఫియా నేత అరాచకాలకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ముగింపు ఇ చ్చింది. పోలీసు అధికారులనుంచి మొదలుకొని గాయకులు, పౌరహక్కుల నేతలు, మాజీ నక్సలైట్ల దాకా ఎందరెందరినో పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ నయీం గ్రేహౌండ్స్ చేతిలో హతమయ్యాడు.

నయీం సొంతూరు భువనగిరికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపై పోలీసులు దృష్టి సారించారు. భువనగిరి ఎంపీపీ వెంకటేశ్ ఇంటితో పాటు ఓ జడ్పీటీసీ ఇంటిలోనూ పోలీసులు సోదా నిర్వహించారని తెలుస్తోంది. వారి ఇళ్ల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… నయీంతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. నయీంకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలువడుతున్నాయి. ఓ కథనం ప్రకారం… నయీం ఏకంగా తెరాస అధినేత కేసీఆర్ బంధువులనే టార్గెట్ చేశాడట. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ క్లాస్ 1 కాంట్రాక్టర్ పైన కన్నేసిన నయీం… ఆయన నుంచి రూ.50 కోట్ల మేర వసూలు చేయాలని భావించాడంటున్నారు.

1990లో ఆర్‌ఎస్‌యూలో చేరిన నయీమ్ పీపుల్స్‌వార్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పోలీసులు తనిఖీలు జరుపుతుండగా వారిపై బాంబు దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు నయీంను పట్టుకుని జైలుకు పంపించారు. జైల్లో పీపుల్స్‌వార్ అగ్రనాయకులతో పరిచయం పెరిగింది. అయితే ఆ సమయంలో పీపుల్స్‌వార్‌ను అంతం చేయడానికి ఐపీఎస్ అధికారి వ్యాస్.. గ్రేహౌండ్స్ పోలీస్ వ్యవస్థను రూపొందించారు.

దీంతో వ్యాస్‌పై కక్షగట్టిన పీపుల్స్‌వార్.. ఆయనను చంపేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్ టీంలో నయీమ్ ఒకడు. 1993లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యాస్‌ను ఏకే-47తో అతి సమీపం నుంచి కాల్చి హతమార్చారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే పీపుల్స్‌వార్‌లో పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావులతో విభేదాలు రావడంతో 1999లో పోలీసులకు లొంగిపోయాడు.

పీపుల్స్‌వార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని నయీమ్ ప్రకటించాడు. దీనికి సంబంధించి తెలంగాణవ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. ఈ సమయంలో పోలీసులకు కోవర్టుగా మారాడు. నయీంను చేరదీసిన పోలీసులు.. నక్సలైట్ల ఏరివేతతో పాటు అజ్ఞాత కార్యకలాపాల్లో వినియోగించుకోవడం ప్రారంభించారు. వార్‌లో పనిచేసిన సమయంలో తెలిసిన సమాచారం, ఎత్తుగడలు, డంప్‌లు, ఆయుధాలకు సంబంధించి నయీమ్ ఇచ్చిన సమాచారంతోనే.. అనేక ఎన్ కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతలను పోలీసులు మట్టుబెట్టారనే ప్రచారం ఉంది. పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని నయీమ్ వారి చేతిలో ఆయుధంగా మారిపోయాడని పీపుల్స్‌వార్ ఆప్పట్లోనే ఆరోపించింది.

భువనగిరి పట్టణానికి చెందిన బెల్లి లలిత ప్రజా గాయకురాలు, తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. పీపుల్స్ వార్ సానుభూ తిపరురాలిగా, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన జనసభలో క్రియాశీల కార్యకర్తగా పని చేస్తున్న తరుణంలో పీపుల్స్ వార్‌కు వ్యతిరేకంగా మారిన నయీం ఆమెతో విభేదిచాడు. ఇందులో భాగంగా తమ్ముడు అలీమొద్దీన్, మరో వ్యక్తితో కలిసి 1999 మే 26న బెల్లిల లలితను కిడ్నాప్ చేసి ఆమె శరీర అవయవాలను 18 ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడవేశాడు.

bellilalitha
bellilalitha

గ్రే హౌండ్స్ బలగాల రూపకర్త ఐపీఎస్ వ్యాస్ హత్యలో నయీం ప్రధాన నిందితుడు. 1993 జనవరి 27న మార్నింగ్ వాక్‌కు వచ్చిన వ్యాస్‌ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపారు. 1995లో నయీంను అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉండగా నయీం కళ్లుగప్పి పారిపోయాడు.

ksvyas
ksvyas

విప్లవ దేశభక్త పులులు వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నయీం ప్రధాన నిందితుడు. 2011 డిసెంబర్ 28న గోవర్ధన్ రెడ్డిని నయీంగ్యాంగ్ హతమార్చింది. రంగారెడ్డి జిల్లాలోని భూవివాదాలు, సెటిల్మెంట్లలో తనకు అడ్డు వస్తున్నాడని చంపేశాడు.

pattollagovardhanreddy
pattollagovardhanreddy

మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి తెరాసలో చేరిన సాంబశివుడితో తనకు ఎప్పటికైనా ముప్పు ఉందని భావించి, మార్చి 23, 2011న తన అనుచరులతో వలిగొండ మండలం వద్ద దారి కాచి హత్య చేశాడు నయీం. సాంబశివుడు సోదరుడు రాములును కూడా నయీం హత్య చేయించాడు. మే 11, 2014న నల్గొండలో హత్య చేయించాడు.

sambashivudu2
sambashivudu2

ఆపరేషన్ నయీం.. :

ఐపీఎస్ అధికారి వ్యాస్, మాజీ మావోయిస్టు సాంబశివుడు, పౌరహక్కుల సంఘం నేత పురుషోత్తం.. ఇలా అనేకమంది ప్రముఖులను దారుణంగా హతమార్చిన మహ్మద్ నయీముద్దీన్ అలియాస్ బాలన్న(45) సోమవారం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ శివారులో గ్రేహౌండ్స్ దళాలు జరిపిన ఆపరేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా షాద్‌నగర్ సమీపంలోని మిలీనియం టౌన్‌షిప్(కాలనీ)లో గల ఓ ఇంటిని షెల్టర్‌గా మార్చుకున్న నయీం, తరచూ ఇక్కడికి వచ్చి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది.

ఆ మేరకు పోలీసులు జరిపిన కూంబింగ్‌లో నయీం దొరికిపోయాడు. మిలీనియం టౌన్‌షిప్‌లో నివసించే గుంటూరు బాషాతో నయీంకు సంబంధాలు ఉన్నాయి. అతని ఇంటికి తరుచుగా వస్తున్నాడు. ఓ భూదందా విషయమై సెటిల్మెంట్ కోసం సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నయీం తన అనుచరులతో కలిసి షాద్‌నగర్‌కు వచ్చాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నయీం ప్రయాణిస్తున్న ఎండీవర్ ( ఏపీ 28 డీఆర్ 5859) కారును గుర్తించి వెంబడించారు. నయీం తాను తరచూ బసచేసే ఇంటికి 80అడుగుల చేరువలోగల మున్సిపల్ పార్కు వద్ద ఉన్నప్పుడు పోలీసులను గమనించాడు. డ్రైవర్‌తో కలిసి కారులో తప్పించుకోవాలని ప్రయత్నించాడు.

ఈ క్రమంలో డ్రైవర్ తన వద్ద షాట్ గన్‌తో పోలీసులపై ఫైరింగ్ ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరుపడంతో డ్రైవర్ పరారయ్యాడు. ఈలోగా నయీం తన వద్ద ఉన్న ఏకే 47తో పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. ఏకదాటిగా 15రౌండ్లు కాల్పులు కొనసాగించాడు. ఇదే తరుణంలో గ్రేహౌండ్స్ పార్టీ పోలీసులు దీటుగా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నయీం అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ సందర్భంగా మరో ముగ్గురు నయీం అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు పారిపోతున్న కారు డ్రైవర్‌ను కూడా ఎన్‌హెచ్ 44పై రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

nayeem
nayeem
Videos

2,733 thoughts on “నెత్తుటి క్రీడ: ఎన్నో హత్యలు.. మరెన్నో ఘోరాలు చేసిన “నయీమ్”