షాక్ ఇస్తోన్న శాత‌క‌ర్ణి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచే ఎంతో ఆస‌క్తి రేపుతోంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి రోజూ ఏదో ఒక సంచ‌ల‌నం క్రియేట్ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్మ దులుపుతోంది. అన్ని ఏరియాల్లోను బాల‌య్య కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రేట్ల‌కు శాత‌క‌ర్ణి రైట్స్ అమ్ముడ‌వుతున్నాయి. ఇప్పటివరకూ గౌతమి పుత్ర శాతకర్ణికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం ప్రాంత హక్కులను హీరో నితిన్‌కు చెందిన గ్లోబల్ సినిమాస్ 11.25 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.

ఇక ఏపీలో కీల‌క‌మైన గుంటూరు ఏరియా హ‌క్కుల‌ను ఎస్.పిక్చర్స్ 4.50 కోట్లకు సొంతం చేసుకుంది. బాల‌య్య స్నేహితుడు, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సీడెడ్ హక్కులను 9 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా హక్కులను 3.60 కోట్ల రూపాయలకు బేకరీ ప్రసాద్ కొనుగోలు చేశారు. నెల్లూరు హక్కులను భరత్ 1.98 కోట్లకు సొంతం చేసుకున్నారు.

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ మా టీవీ రూ.9 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఓవర్సీస్ హక్కులను 8 కోట్లకు 9పీఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఇక టోట‌ల్‌గా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.80 కోట్ల వ‌ర‌కు అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *