చిరుకు కోటి.. బాలయ్యకు కోటి ఇరవై!!

సంక్రాంతి వచ్చేస్తోంది. 2017లో తెలుగు ప్రేక్షకులు కనీవినీ ఎరుగని రీతిలో ఈ పండుగను ఎంజాయ్ చేయబోతున్నారు. దానికి కారణం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 అలాగే నందమూరి బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజవుతున్నాయి. 11 మరియు 12 తేదీల్లో ఈ సినిమాల ప్రకంపనలను తట్టుకోవడానికి టాలీవుడ్ సిద్దంగా ఉండాల్సిందే.

అయితే ఇప్పుడు బాలయ్య తెస్తున్న శాతకర్ణి తెలుగువారి చరిత్రను చాటిచెప్పే సినిమా. అసలు ఇప్పటివరకు తెలుగువారికే తెలియని చరిత్రను ప్రపంచానికి చెబుతున్న సినిమా. తెలుగువారందరూ తెలుసుకోవాల్సిన చర్రిత్ర కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రేపో మాపో ఇచ్చేస్తుంది. ఈ కారణంగా కలక్షన్లపై ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్న విషయం. ఒక టిక్కెట్టుపై దాదాపు 10 రూపాయల వరకు బాలయ్య ప్రొడ్యూసర్లు అటు చిరంజీవి ప్రొడ్యూసర్లకంటే అదనంగా తీసుకునే ఛాన్సు ఉంటుంది. ఆ లెక్కన చూస్తే.. చిరంజీవికి 1 కోటి కలక్షన్ షేర్ వస్తే.. బాలయ్య 1 కోటి 20 లక్షల రూపాయల షేర్ వస్తుంది. ఎంచుకున్న సబ్జెక్ట్ అటువంటిది కావడంతో బాలయ్య నిర్మాతలకు ఈ మినహాయింపు లభించింది.

ఇకపోతే అసలు ధియేట్రికల్ వసూళ్ళలో బయ్యర్లను లాభాల బాట నడపాలంటే.. శాతకర్ణి షుమారు 63 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉండగా.. ఖైదీ దాదాపు 92.5 కోట్లను వసూలు చేయాలి. అప్పుడే అందరూ సేఫ్ జోన్ లోకి వస్తారు. అది సంగతి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *