రివ్యూ : గౌతమ్‌నంద మూవీ

కథ:
బిలియనీర్‌ విష్ణు ప్రసాద్‌(సచిన్‌ ఖేడ్‌ఖర్‌)కి ఒకే ఒక వారసుడు ఘట్టమనేని గౌతమ్‌(గోపీచంద్‌). గౌతమ్‌కు బిజినెస్‌ బాధ్యతలు అప్పగించాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. గౌతమ్‌ స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తుంటాడు. విష్ణు ప్రసాద్‌ స్నేహితుడి(ముకేష్ రుషి) కూతురు ముగ్ధ(కేథరిన్‌), గౌతమ్‌ను ప్రేమిస్తుంటుంది. ఓ పార్టీలో తాగిన మత్తులోని గౌతమ్‌ అక్కడ పనిచేసే బేరర్‌(తనికెళ్ళ భరణి)ని కొడతాడు. నీ తండ్రి సంపాదించిన పేరుతో బ్రతకడం కాదు, అసలు నువ్వెవరో కనుక్కో అని బేరర్‌ చెప్పడంతో గౌతమ్‌ జీవితం మలుపు తిరుగుతుంది. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని బయలుదేరిన గౌతమ్‌కు తన పోలికలతో ఉన్న నంద(గోపీచంద్‌) కనపడతాడు. నంద హైదరాబాద్‌లోని బోరబండ మురికివాడల్లో ఉంటాడు. తనకేమో బాగా డబ్బు సంపాదించాలనే కోరికుంటుంది. నంద గురించి తెలుసుకున్న గౌతమ్‌ అతని స్థానంలో బోరబండ వెళితే, గౌతమ్‌ స్థానంలో నంద బిలియనీర్‌ ఇంటికి చేరుతాడు.
గౌతమ్‌ అనుభవించే సుఖాలను అనుభవిస్తుంటాడు నంద. స్ఫూర్తి నందను ఇష్టపడుతుంటుంది. మరోవైపు గౌతమ్‌, పేదవారి బ్రతుకులు ఎలా ఉంటాయి. అమ్మ, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు. కథ ఇలా సాగిపోతుండగా గౌతమ్‌పై రెండు సార్లు ఎవరో ఎటాక్‌ చేస్తారు. దాంతో గౌతమ్‌కి తననెవరు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుని చేసే ప్రయత్నంలో గౌతమ్‌కు తెలిసే నిజం ఏమిటి? చివరకు గౌతమ్‌, నందులేమౌతారు? కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

నటీనటులు :

మాస్ యాక్షన్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న గోపిచంద్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. మేకోవర్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా వేరియేషన్ చూపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్న గోపిచంద్, రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ తో మెప్పించాడు. హీరోయిన్ కేథరిన్ నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా.. గ్లామర్ షోతో అదరగొట్టింది. హన్సిక స్క్రీన్ టైం కూడా తక్కువ కావటంతో ఉన్నంతలో పరవాలేదనిపించింది. విలన్లుగా ముఖేష్ రుషి, నికితిన్ ధీర్ లు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో సచిన్ కేడ్కర్, చంద్రమోహన్, సీత తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్‌ పాయింట్స్‌:
సినిమాటోగ్రఫీ
నటీనటుల పనితీరు
మేకింగ్‌ వేల్యూస్‌
మైనస్‌ పాయింట్స్‌:
సంగీతం
బలహీనమైన కథ
కామెడి లేదు
నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియా
తారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌
ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు
దర్శకత్వం: సంపత్‌ నంది
రేటింగ్‌: 2.5/5
Videos

Leave a Reply

Your email address will not be published.