గీత గోవిందం రేంజ్ ఎంత – ఫైనల్ కలెక్షన్

ఇప్పుడు గీత గోవిందం ప్రస్తావన కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ అంతకన్నా షాక్ ఇచ్చే సంగతి మరొకటి ఉంది. ఆగస్ట్ 15న ఇది విడుదలయ్యాక చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ ను పలకరించాయి. రెండున్నర నెలలు దాటేసింది. చిన్నవి మొదలుకుని క్రేజీ మూవీస్ దాకా చాలా వచ్చాయి.అయినా ఈ రోజుకి హైదరాబాద్, విజయవాడ, కర్నూల్ లాంటి ప్రధాన కేంద్రాల్లో గీత గోవిందం ఇంకా ఆడుతూనే ఉండటం దీని సక్సెస్ ఏ రేంజ్ అనేది చెప్పకనే చెబుతోంది. కేవలం 15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ వసూళ్ల ప్రకారం శాతాన్ని లెక్కేస్తే టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అతిశయోక్తి అనిపించినా ఇదే నిజం. శాటిలైట్ ని మరీ చవకగా కొట్టేసిన జీ ఛానల్ దీని ద్వారా తన ఛానల్ హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ ఆశిస్తోంది. ఇక క్లోజింగ్ కు అతి దగ్గరలో ఉన్న గీత గోవిందం ఫైనల్ ఫిగర్స్ ఏంటో చూద్దాం

నైజామ్ – 19 కోట్ల 77 లక్షలు

వైజాగ్ – 6 కోట్ల 6 లక్షలు

ఈస్ట్ గోదావరి – 4 కోట్లు

వెస్ట్ గోదావరి – 3 కోట్ల 19 లక్షలు

కృష్ణా – 3 కోట్ల 51 లక్షలు

గుంటూరు – 3 కోట్ల 75 లక్షలు

నెల్లూరు – 1 కోటి 74 లక్షలు

సీడెడ్ – 7 కోట్ల 2 లక్షలు

తెలుగు రాష్ట్రాలు మొత్తం – 49 కోట్ల 5 లక్షలు

కర్ణాటక – 6 కోట్ల 8 లక్షలు

తమిళనాడు – 2 కోట్ల 13 లక్షలు

యుఎస్ – 9 కోట్ల 81 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 2 కోట్ల 48 లక్షలు

ఓవర్ ఫ్లోస్ – 55 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ క్లోజింగ్ షేర్ – 70 కోట్లు 

ఫైనల్ గ్రాస్ – 127 కోట్ల 80 లక్షలు 

Videos

2,852 thoughts on “గీత గోవిందం రేంజ్ ఎంత – ఫైనల్ కలెక్షన్