గీత గోవిందం మొదటి వారం వసూళ్లు

ఏ ముహూర్తంలో గీత గోవిందం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారో కానీ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రిస్క్ తీసుకుని కేవలం సెలవు రోజు అనే కారణంతో ఆగస్ట్ 15 విడుదల చేయటం ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. నిన్నటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న గీత గోవిందం ఇప్పటి దాకా 38 కోట్ల 60 లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చుకుని ఆన్ బీటబుల్ రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి దాకా మొదటి వారానికే ఇంత మొత్తం తెచ్చిన టాప్ 20 సినిమాల్లో ప్లేస్ దక్కించుకుంది. మీడియం రేంజ్ హీరోల్లో చూసుకుంటే ఇదే నెంబర్ వన్ అని చెప్పొచ్చు.

గతంలో అఆ ఇలాంటి ఫీట్ సాధించినా దానికి త్రివిక్రమ్ అనే బ్రాండ్ బాగా పని చేసింది. ఫుల్ రన్ లో 34 కోట్లు మాత్రమే ఇచ్చింది.  అర్జున్ రెడ్డిది ముమ్మాటికీ ఇంత పెద్ద సక్సెస్ కాదు. నాని ఎంసిఎ ఫుల్ రన్ లో మాత్రమే ఇంత కన్నా కొద్ది తక్కువ తెచ్చుకుని హిట్ స్టాంప్  వేయించుకుంది. స్టార్ హీరోల రేంజ్ లో గీత గోవిందంకు వచ్చిన రెస్పాన్స్ చూసి గీత ఆర్ట్స్ కాంపౌండ్ కూడా షాక్ లో ఉంది. ఈ రోజు సెలవుతో పాటు చివరి శనివారం ప్లస్ సండేని బాగా వాడుకోబోతున్న గీత గోవిందంకు ఎల్లుండి వస్తున్న మూడు సినిమాలు పెద్ద బ్రేక్ వేసేలా లేవు.ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ – 10 కోట్ల 55 లక్షలు

సీడెడ్ – 3 కోట్ల 90 లక్షలు

ఉత్తరాంధ్ర – 2 కోట్ల 85 లక్షలు

గుంటూరు – 2 కోట్ల 6 లక్షలు

ఈస్ట్ – 2 కోట్ల 11 లక్షలు

వెస్ట్ – 1 కోటి 75 లక్షలు

కృష్ణా – 2 కోట్ల 10 లక్షలు

నెల్లూరు – 83 లక్షలు

తెలుగు రాష్ట్రాలు (7 రోజుల షేర్) – 26 కోట్ల 15 లక్షలు 

రెస్ట్ అఫ్ ఇండియా – 4 కోట్ల 65 లక్షలు

ఓవర్సీస్ – 7 కోట్ల 80 లక్షలు

ప్రపంచవ్యాప్త షేర్ (7 రోజులు) – 38 కోట్ల 60 లక్షలు 

Videos

39 thoughts on “గీత గోవిందం మొదటి వారం వసూళ్లు

Leave a Reply

Your email address will not be published.