గీత గోవిందం రెండో రోజూ కలెక్షన్స్ అదిరిపోయాయి !

పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంటుంది.సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15తో పాటు లాంగ్ వీకెండ్ ఈ చిత్రానికి మరింత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

సెకండ్ డే కలెక్షన్స్
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు, కర్నాటకలో రూ. 1.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.3 కోట్లు, యూఎస్ఏలో రూ. 1.4 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రెండో రోజు వరల్డ్ వైడ్ రూ. 10.10 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో మొత్తం గ్రాస్ రూ. 26.50 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ. 15.70 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్ల ట్రేడ్ వర్గాల టాక్.‘గీత గోవిందం’ థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారు. రెండు రోజుల్లోనే రూ. 15.70 కోట్ల షేర్ రాబట్టడంతో….. 100 శాతం ఇన్వెస్ట్మెంట్ రావడంతో పాటు సినిమా లాభాల బాట పట్టినట్లయింది.

Videos

288 thoughts on “గీత గోవిందం రెండో రోజూ కలెక్షన్స్ అదిరిపోయాయి !

Leave a Reply

Your email address will not be published.