GHMC ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస పార్టీ అత్యధిక డివిజన్లు (95+) గెలిచి మేయర్ పీఠాన్ని ఎగురేసుకుపోయింది. తెదేపా మరియు బిజెపి పార్టీల కూటమి 10 డివిజన్లు కూడా గెలువలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ప్రభావం చోపలేక పోయింది.

హైదరాబాద్ లో ని సేటిలర్స్ కూడా తెరాస వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది, బల్దియా ఎన్నికలకు ముందు జరిగిన కాపు గర్జన విధ్వంసం కూడా ఒక రకంగా తెరాస కు కలిసివచ్చినట్టు కనబడుతుంది. అంత పెద్ద తెలంగాణా  ఉద్యమం జరిగినప్పుడు  కూడా జరగని విధ్వంసం ఒక్క కాపు గర్జన రోజు జరిగింది, దీనిని చంద్ర బాబు ప్రభుత్వం ఆపలేకపోయింది.

అదే సమయంలో తెలంగాణా ఏర్పాటు జరిగిన తరువాత హైదరాబాద్ లో ఉన్న సేటిలర్లు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివసిస్తున్నారు, కాబట్టి తెరాస పార్టీ ని సేటిలర్స్ నమ్మినట్లు కనబడుతున్నది.

పార్టీ సీట్లు
తెరాస 95
తెదేపా – బిజెపి 05
కాంగ్రెస్ 01
MIM 30
ఇతరులు 00
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *