గోమూత్రంతో బంగారం…

గోమూత్రం ఇన్నాళ్ళు ఆరోగ్య పరంగానే మంచిదనుకున్నారు గోమూత్రంపై జరుగుతున్న పరిశోధనల్లో మరో కొత్త కోణం తెరమీదకు వచ్చింది. ఆవు మూత్రంలో బంగారం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుజరాత్ లో జరిగిన పరిశోధనల్లో జునాగఢ్‌ వ్యవసాయ వర్శిటీ పరిశోధకులు ఈ విషయం తేలింది. ఆ రాష్ట్రంలోని జునాఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

ఆవు మూత్రంలో స్వల్ఫంగా బంగారం కూడా ఉందని తేల్చారు. పాల ఉత్పత్తికి పేరు గాంచిన గిర్‌ జాతి ఆవు మూత్రంలో లీటరుకు మూడు నుంచి పది మిల్లీ గ్రాముల బంగారం ఉందని పరిశోధనల్లో వారు తేల్చారు. గో మూత్రాన్ని రసాయన ప్రక్రియల ద్వారా ఘనీభవింపజేయడం వలన బంగారం తయారుచేయవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఇంతేకాకుండా ఆవుల మూత్రంలో వ్యాధుల నిరోధక శక్తి ఉన్నట్లుగా జునాఘడ్ అగ్రికల్చర్ వర్సిటీ పరిశోధనల్లో తేలింది. గేదే – గొర్రె – మేక – ఒంటెలపై పరిశోధనలు చేయగా వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఆధారాలేవీ కనిపించలేదట. అయితే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక రకాల వ్యాధులకు నిరోధకంగా పనిచేసే లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. జునాఘడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ఇపుడు ఆవు విశిష్టత విషయంలో కొత్త  అంశాన్ని వెల్లడించినట్లయింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *