కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు…?

కేంద్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయా..? ఈ ప్రశ్నకు ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. జీత భత్యాలన్నీ కలిపి 23 శాతం వరకూ వారికి పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్‌ కార్యదర్శి పి.కె.సిన్హా  నాయకత్వంలో ఏర్పాటైన ఏడో వేతన సంఘం ఈ మేరకు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. బుధవారం జరిగే కేంద్ర కేబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛను మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం అన్ని ప్రభుత్వ శాఖలను ఆన్‌లైన్‌ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *