శ్రీకాకుళం లో గవర్నర్ పర్యటన మందుబాబులను తరిమికొట్టండని పిలుపు

స్వచ్ఛందంగా మద్య నిషేధాన్ని అమలు చేయండి మందుబాబు లను తరిమికొట్టండి గవర్నర్
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్  ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో  పర్యటిస్తున్నారు.  ఇయన సీతంపేటలోని ఐటీడీఏను సందర్శించి అక్కడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, మహిళల వృత్తి, సంపాదన, ఖర్చు తదితర విషయాల గురించి గవర్నర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మద్యపానానికి ప్రతి కుటుంబం దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు. గ్రామస్థులే స్వచ్ఛందంగా మద్యనిషేధాన్ని పాటించాలని సూచించారు.  పిల్లల్ని బాగా చదివించాలని, పెద్దలు పనులకు వెళ్లాలని, మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికస్వావలంబన సాధించాలని సూచించారు. మద్యం సేవిస్తున్న వారిపై గ్రామస్థులే నిర్ణయం తీసుకుని . నిత్యమూ మందుకొట్టి మహిళల్ని ఇబ్బంది పెడ్తున్న వారిని ఊరి నుంచి తరిమి కొట్టాలని గిరిజన స్వచ్ఛందంగా మద్య నిషేధాన్ని అమలు చేయాలన్నారుమహిళలకు సూచించారు. మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులతో మాట్లాడవద్దని, ఆ విధంగానైనా వారిని తిరిగి బడిబాట పట్టించాలని గవర్నర్ వ్యాఖ్యానించారు.

Videos

Leave a Reply

Your email address will not be published.