వీర జవాన్ అభినందన్ కు ‘వీర్ చక్ర’

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర్ చక్ర పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. శత్రు చరలో ఉన్న అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఈ అవార్డును అందించనున్నారు. దీనితో పాటు యుద్ధసేవా పతకాన్ని ప్రదానం చేయనున్నారు. జవాన్లకిచ్చే పరమ్‌వీర చక్ర, మహా వీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగిన బలకోట్ దాడి తర్వాత రోజు అనగా 27వ తేదీన పాకిస్తాన్ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. కానీ మిగ్ విమానం కూడా కూలిపోతున్నప్పుడు తను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో దిగారు, అక్కడివారు అభినందన్ ని పట్టుకొని పాక్ సైనికులకు అప్పగించారు. కానీ పాక్ ఎంత ఒత్తిడి తెచ్చిన మన రహస్యాలను అతను వెల్లడించలేదు. దీనితో ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిన అతనికి భారత ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది.

Videos

42 thoughts on “వీర జవాన్ అభినందన్ కు ‘వీర్ చక్ర’

Leave a Reply

Your email address will not be published.