జీఎస్టీ తర్వాత టూవీలర్ ధరల్లో తగ్గింపు ఇలా ఉండబోతోంది!

ఇవాల్టి నుంచి జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. అలా ధరలు తగ్గిన జాబితాలో టూవీలర్స్ కూడా ఒకటి. జీఎస్టీలో భాగంగా టూవీలర్స్‌పై 28శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే. గతంలో ఈ పన్ను 30 శాతానికి పైగానే ఉండేది. దీంతో టూవీలర్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సగటును ఏయే కంపెనీ బైక్స్‌ ఎంతెంత ధర తగ్గనున్నాయో చూద్దాం.
హీరో మోటార్‌కార్ప్:
స్ప్లెండర్, ప్యాషన్, గ్లామర్, అచీవర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, కరిజ్మా, డ్యుట్, ప్లెషర్, మాస్ట్రో
ఈ మోడల్స్‌పై గతంలో 30.2 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం 28శాతానికి తగ్గినందు వల్ల 1000 నుంచి 2వేల వరకూ ధర తగ్గే అవకాశముంది.
బజాజ్ ఆటో: ఫుల్ పల్సర్, అవేంజర్ అండ్ వీ రేంజ్, డిస్కవర్, ప్లాటినా, కేటీఎమ్ డ్యూక్ 200, కేటీఎమ్ ఆర్‌సీ 200
 1000 నుంచి 7వేల వరకూ తగ్గే అవకాశం
 
హోండా: డ్రీమ్ సిరీస్, యునికార్న్, షైన్, లివో, సీడీ, యాక్టివా, డియో, ఏవియేటర్, నవీ, క్లిక్
 1000 నుంచి 5వేల వరకూ తగ్గే అవకాశం
 
యమహా: శల్యూటో, ఎఫ్‌జడ్, ఎస్‌జడ్, ఫేజర్, ఆర్15, ఎఫ్‌జడ్25, ఫ్యాసినో, ఆల్ఫా, రే
 1000 నుంచి 2500 వరకూ తగ్గే అవకాశం
 
సుజుకీ: గిక్సర్ రేంజ్, హయతే, యాక్సెస్, లెట్స్
1000 నుంచి 2500 వరకూ తగ్గే అవకాశం
అయితే ఇక్కడ వినియోగదారుడు గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే ఇంజన్ సామర్థ్యం 350 సీసీ లోపు ఉన్న ద్విచక్ర వాహనాల ధరలే తగ్గుతాయి. 350 సీసీ పైగా ఉన్న బైక్‌లపై పన్ను గతంలో 30 శాతం ఉంటే అది 31 శాతానికి స్వల్పంగా పెరిగింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *