రివ్యూ: `గుంటూరోడు`..ప‌క్కా మాసోడు

క‌థ:
సూర్య‌నారాయ‌ణ‌రావు(రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కు త‌న కొడుకు క‌న్నా(మంచు మ‌నోజ్‌) అంటే ప్రాణం. త‌ల్లి లేని పిల్ల‌వాడు కాబ‌ట్టి అతి గారాబం చేస్తాడు. పెరిగి పెద్దైన క‌న్నాకు రెండు అల‌వాట్లు ఉంటాయి. ఆనందం వ‌స్తే డ్యాన్స్ చేయ‌డం, కోపం వ‌చ్చి చెయ్యి దుర‌ద పెట్టిన‌ట‌ప్పుడు గొడ‌వ‌లు ప‌డ‌టం. క‌న్నాను గొడ‌వ‌ల‌కు దూరం పెట్టాల‌నే ఉద్దేశంతో సూర్య నారాయ‌ణ అత‌నికి పెళ్ళి సంబంధం చూస్తాడు. పెళ్ళిచూపుల‌కు వెళ్ళినా క‌న్నా, అక్కడ పెళ్ళి కూత‌రు స్నేహితురాలు అమృత‌(ప్ర‌గ్యా జైశ్వాల్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు.
ఆమె ప్రేమ కోసం ఏమైనా చేయాల‌నుకునే రేంజ్‌కు వెళ‌తాడు. అదే స‌మ‌యంలో అమృత అన్న‌య్య‌, గుంటూరులో మంచి పేరున్న క్రిమిన‌ల్ లాయ‌ర్ శేషు(సంప‌త్‌). శేషుకు ఈగో ఎక్కువ‌, త‌న‌ను ఎవ‌రైనా ఎదిరిస్తే ఒప్పుకోడు, వారిని ఏదో ఒక కేసులో ఇరికించేస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో కన్నా, శేషుల మ‌ధ్య గొడ‌వ మొద‌లవుతుంది. ముందు శేషు, క‌న్నాను చాలా ఇబ్బంద‌ులకు గురి చేస్తాడు. అయితే క‌న్నా వాటిని త‌ప్పి కొట్టి, అత‌నికి స‌వాలుగా నిలుస్తాడు. ఈలోపు క‌న్నా, అమృత‌ల ప్రేమ వ్య‌వ‌హారం శేషుకు తెలుస్తుంది. అప్పుడు శేషు ఏం చేస్తాడు? క‌న్నా త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి శేషును ఎలా దెబ్బ తీస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
 
ప్ల‌స్ పాయింట్స్:
– నటీన‌టుల ప‌నితీరు
– సినిమాటోగ్ర‌ఫీ
– ట్యూన్స్‌
 
మైన‌స్ పాయింట్స్:
– మంచి కామెడి ట్రాక్ లేదు
– బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– రొటీన్ మాస్ స్టోరీ
రేటింగ్: 2.75/5
నిర్మాణ సంస్థ: క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నటీన‌టులు: మంచు మ‌నోజ్‌, ప్ర‌గ్యా జైశ్వాల్‌, కోట‌ శ్రీనివాస‌రావు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, సంప‌త్‌, పృథ్వీ, కాశీవిశ్వ‌నాథ్ త‌దిత‌రులు
సంగీతం: డిజె.వ‌సంత్‌
ఛాయాగ్ర‌హ‌ణం: సిద్ధార్థ్ రామ‌స్వామి
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
నిర్మాత: శ్రీ వ‌రుణ్ అట్లూరి
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కె.స‌త్య‌
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *