ఇక హర్ధిక్ రెడీ…

వెస్టిండీస్‌ పర‍్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హర్దీక్ పాండ్య..  స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో సభ్యుడైన హార్దిక్‌.. తన ప్రాక్టీస్‌ను ముందుగానే మొదలు పెట్టేశాడు.  దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు నెట్స్‌ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన హార్దిక్‌ భారీ షాట్లుపైనే గురిపెట్టాడు. ప్రధానంగా ఎంఎస్‌ ధోని ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను హార్దిక్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశాడు. ప్రతీ బంతిని హిట్‌ చేస్తూ తన బ్యాటింగ్‌ పవర్‌ను పరీక్షించుకున్నాడు.  దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

Videos