ఏపీలో పలు చోట్ల భారీ వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు 170 కి.మీ అగ్నేయంగా కేంద్రీకృతమై తీవ్రవాయుగుండంగా మరింది. గంటకు 11 కి.మీ వేగంతో కోస్తాంధ్ర దిశగా కదులుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తదుపరి తుఫానుగా మారే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం, మచిలీపట్నం, చెన్నై ఓడరేవు తదితర ప్రాంతాల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం వల్ల జనజీవనానికి అంతరాయమేర్పడింది. భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి సత్రాలు, తిలక్‌రోడ్‌, లక్ష్మీపురం సర్కిల్‌, వెస్ట్‌ చర్చి అండర్‌ బ్రిడ్జి, రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. నగరంలో పలు చోట్ల వ్యాపారులు, యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పురపాలకశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రి నుంచి సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, తిరుపతి నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు ఆత్మకూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలో వర్షం కురిసింది. తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు వాయుగుండం ప్రభావం ఉండటంతో నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తడలో 14.4, సూళ్లూరుపేటలో 14, వాకాడులో 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Videos

4 thoughts on “ఏపీలో పలు చోట్ల భారీ వర్షం

 • December 12, 2019 at 4:19 pm
  Permalink

  Aw, this was a very nice post. In concept I would like to put in writing like this additionally – taking time and precise effort to make a very good article… however what can I say… I procrastinate alot and certainly not appear to get something done.

 • Pingback: vagragenericaar.org

 • April 15, 2020 at 3:50 pm
  Permalink

  Absolutely indited articles, regards for entropy. “You can do very little with faith, but you can do nothing without it.” by Samuel Butler.

Leave a Reply

Your email address will not be published.