ప్రభాస్‌, అనుష్కకు పెళ్లి కుదిరింది!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి వార్తలు గత కొంతకాలంగా టాలీవుడ్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి చిత్రంలో జంటగా నటించిన ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ జంట త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారా అంటే ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు అవుననే చెబుతున్నాడు. ఆ ప్రముఖ సినీ విశ్లేషకుడు మరెవరో కాదు ఉమైర్ సంధు. తాజాగా తన ట్వీట్టర్ పేజ్‌లో బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రభాస్, అనుష్కల ప్రేమ వ్యవహారం గురించి ట్వీట్ చేశాడు.

ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకి చెప్పినట్లుగా ఉమైర్ సంధు ఈ విషయాన్ని తెలిపాడు. ప్రభాస్, అనుష్కలిద్దరి మధ్య ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని, వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోందని తన స్నేహితుడు తనకి చెప్పినట్లుగా ఆయన పోస్ట్ చేశాడు.

అంతే కాదు బాహుబలి ఫ్యాన్స్‌కి బ్రేకింగ్ న్యూస్. ప్రభాస్, అనుష్కలు డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారు. వారిద్దరూ నిజంగానే రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ మరో ట్వీట్‌లో తెలిపాడు.  అయితే ఈ వార్తపై ప్రభాస్‌ కానీ, అనుష్క కానీ  పెదవి విప్పడం లేదు. ఉమైర్‌ సంధు ట్విట్‌ చేసింది వాస్తవమా, కాదా అనేది తెలియాలంటే వాళ్లు స్పందించేవరకూ వెయిట్‌ చేయాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *