టాలీవుడ్ హీరో తండ్రి మిస్టరి మరణం

వర్ధమాన సినీ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ బుధ‌వారం ఉద‌యం అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందాడు. వ‌ర్థ‌న్ మృతిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌ర్థ‌న్ కుటుంబ స‌భ్యులు చెపుతున్న దాని ప్ర‌కారం ఆయ‌న 6వ అంతస్తు నుంచి మంగళవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నేటి వేకువజామున ఆయన మృతిచెందిన‌ట్టు తెలుస్తోంది.

వ‌ర్థ‌న్ మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రమాదవశాత్తూ వర్ధన్ మృతిచెందడంతో తనీష్, ఆయన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో ఉన్నారు. అయితే వ‌ర్థ‌న్ ప్ర‌మాద‌వ‌శాత్తు జారిప‌డి మృతి చెందార‌ని కుటుంబ స‌భ్యులు చెపుతున్నా ఆయ‌న ప్రమాదవశాత్తూ జారి పడలేదని ఆత్మహత్యాయత్నం చేశారని భిన్న కథనాలు వినిసిస్తున్నాయి. దేవుళ్లు, మన్మధుడు సినిమాలలో బాలనటుడిగా నటించిన తనీష్ నచ్చావులే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచమమైన విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *