శ్రీహరికోట షార్ లో హైఅలర్ట్

దక్షిణాది తీర ప్రాంతాల గుండా ఉగ్రమూకలు దేశంలోకి చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో షార్‌ దగ్గర హైఅలర్ట్‌ ప్రకటించారు. బంగాళాఖాతంలో 50 కి.మీ. మేర సిఐఎస్‌ఎఫ్, మెరైన్‌ పోలీసుల తనిఖీలు చేపట్టారు. అలాగే శ్రీహరికోట అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. వేనాడు దర్గాకు వచ్చే వాహనాలను భద్రతా బలగాలు తనిఖీ చేస్తున్నారు. షార్‌ మొదటి, రెండు గేట్ల వద్ద సాధారణ రోజుల కన్నా భద్రతను మరింత పెంచారు.

Videos