చంద్రబాబుకు 97 మంది సిబ్బందిని నియమించండి: హైకోర్ట్

మాజీ సీఎం చంద్రబాబు భద్రత వ్యవహారంలో హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. తన భద్రత కుదించడాన్ని సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు తీర్పును రిజర్వు చేశారు. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. చంద్రబాబు కాన్వాయ్‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు సీఎస్‌వోను ప్రభుత్వం నియమించవచ్చని హైకోర్టు తెలిపింది.

Videos

22 thoughts on “చంద్రబాబుకు 97 మంది సిబ్బందిని నియమించండి: హైకోర్ట్

Leave a Reply

Your email address will not be published.