చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రికత..

ఛలో ఆత్మకూరు టెన్షన్ గుంటూరు జిల్లాలో అదృకంగా మారింది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద హై టెన్షన్ కనిపిస్తుంది.  దీనితో బాబీ నివాసం చుట్టూ భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఆయన ఇంటి వద్దకు వస్తున్న టి‌డి‌పి నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. దీనితో అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎవరిని చంద్రబాబు ఇంటి వద్దకు రానియడం లేదు. మరోవైపు మాజీ మంత్రి లోకేశ్ ను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులు చంద్రబాబు నివాసానికి ఎలా వస్తారని లోకేశ్ ప్రశ్నించారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు ఛలో ఆత్మకూరు కు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలా అడ్డుకుంటారు అనేది ఉత్కంఠ భరితంగా మారింది.

Videos