డేంజర్ బెల్ : నంద్యాల్లో టీడీపీ పుట్టి మునుగుతోందా..?

భారీ స్థాయిలో నమోదయ్యేలా ఉంది పోలింగ్. మామూలుగా కాదు.. ఏకంగా ఎనభై శాతం పోలింగ్ నమోదైనా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదీ నంద్యాల్లో ఓటింగ్ సరళి. మామూలుగా నంద్యాల్లో అరవై నుంచి అరవై శాతం పోలింగ్ నమోదు కావడమే ఎక్కువ. కానీ.. ఈ సారి ఏకంగా ఎనభై శాతం పోలింగ్ అంటే.. ఇది కచ్చితంగా డేంజర్ బెల్లే.

మరి ఎవరికి ప్రమాద ఘంటిక అంటే.. అది అధికార పార్టీకే అని చెప్పాలి. ఏకంగా ఎనభై శాతం పోలింగ్ నమోదు కావడం అంటే.. అది అధికార పార్టీలో గుబులు రేపే అంశమే. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నప్పుడే అధిక పోలింగ్ నమోదవుతుందనేది ఒక అంచనా. ఇప్పుడు నంద్యాల్లో అదే జరుగుతోంది. క్రితం సారి ఎన్నికల సరళిని చూస్తే.. నంద్యాల్లో అరవై రెండు నుంచి 69 శాతం పోలింగ్ నమోదైన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఎనభై శాతం పోలింగ్ నమోదయ్యేలా ఉంది.

దీంతో.. ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితికి కారణం అవుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అధికార పార్టీ హవా ఉండి ఉంటే.. పోలింగ్ శాతం యాభై నుంచి అరవై శాతానికి పరిమితం కావాల్సింది. కానీ ఏకంగా ఎనభై అంటున్నారు.. ఈ రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఇది అధికార పార్టీకి ప్రమాద ఘంటికే అని.. రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చే అంశమని చెబుతున్నారు. మరి ఏం జరగుబోతోందో!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *