పూజిత , రేఖారాణి ఓ మంత్రి పీఏ

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై రచ్చకెక్కిన ఆమె తన భర్త తనను మోసం చేశాడని.. మరో ఐఏఎస్ అధికారిణిని పెళ్లాడారంటూ మంత్రి దగ్గర పీఏగా పని చేసే విజయ్ గోపాల్ ను తాను పెళ్లాడినట్లుగా సినీ నటి పూజిత  సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన భర్త విజయ గోపాల్ ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని పూజిత ఆరోపించారు. ఈ రేఖారాణి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మేనేజింగ్ డైరెక్టర్.

సచిన్ టెండుల్కర్ 2014లో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె ఆ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్నారు. రేఖారాణి దివంగత అధికారి పరదేశి నాయుడు సతీమణి. పరదేశీ నాయుడు ఇరవై రెండేళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో మైనింగ్ బ్లాస్ట్‌లో చనిపోయాడు. రేఖా రాణి పరదేశి నాయుడు సతీమణి. రేఖారాణి సీనియర్ ఐఏఎస్ అధికారణి. తన భర్త మృతి అనంతరం ఆమె ఉద్యోగంలోకి వచ్చారు. ఆమె తొలుత ఆర్డీవోగా పని చేశారు.

రేఖారాణి తనయుడు అమెరికాలో ఓ ఎమ్మెన్సీ కంపెనీలో పని చేస్తున్నారు. విజయ గోపాల్ జర్నలిస్ట్‌గా పని చేశారు. అతను ప్రస్తుతం అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పీఏగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం విజయ గోపాల్ – రేఖారాణిలు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి అంజనా తొలి సాక్షి అని పూజిత అంటున్నారు. మరోవైపు, పూజిత నటి. ఆమె పలు తెలుగు చిత్రాల్లో నటించారు. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ బిజీ అయ్యారు. రుతురాగాలు సీరియల్‌లో నటించారు. కాగా ఈమె ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు బుక్ చేయలేదు. అయితే, విచారణ జరుపుతున్నారు.

ias-officer-married-my-hubby-says-tollywood-actress-poojitha-trying
ias-officer-married-my-hubby-says-tollywood-actress-poojitha-trying

విజయ గోపాల్ తనను పెళ్లి చేసుకున్నారని, తమ ఇద్దరికీ ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు ఐఏఎస్ రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని నటి పూజిత ఆరోపిస్తున్నారు. అతను తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో, ఏప్రిల్ 28వ తేదీన పెళ్లి చేసుకున్న విజయ గోపాల్ – రేఖారాణిలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. పూజితతో కేవలం విజయ గోపాల్‌ది సహజీవనమేనని, పెళ్లి చేసుకోలేదని ఇరువురు చెబుతున్నారు.

తాను అన్నీ లీగల్‌గా చూసుకున్నాకే అతనిని పెళ్లాడానని రేఖారాణి చెబుతున్నారు. పూజిత తమకు పరువు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని, ఆమె మీడియాకు ఎక్కకుండా చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లవచ్చునని చెప్పారు. తాను మాత్రం అతని గురించి అంతా తెలుసుకునే పెళ్లి చేసుకున్నానని, అలాగే పూజితను అతను పెళ్లి చేసుకోలేదని, కేవలం సహజీవనమే అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.