ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం నిజమేనాన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

americaఉగ్ర దాడుల కోసం అల్‌కాయిదా ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ శిక్షణ ఇవ్వడం నిజమేనని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంగీకరించారు. అమెరికాలో సెప్టెంబరు 11, 2001 నాటి దాడులకు ముందు అల్‌ కాయిదా ఉగ్రవాదులకు పాక్‌ సైన్యం, ఐఎ్‌సఐ శిక్షణ ఇచ్చాయని తెలిపారు. కానీ 9/11 తర్వాత ప్రభుత్వం విధానం మార్చుకుందని, సైన్యం మాత్రం మార్పుపై విముఖత చూపిందని చెప్పారు. అమెరికాకు చెందిన మేధో బృందం-విదేశీ సంబంధాల మండలి(సీఎ్‌ఫఆర్‌)లో ఇమ్రాన్‌ మాట్లాడారు.

అల్‌ కాయిదా చీఫ్‌ ఒసాబా బిన్‌ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్‌ పాకిస్థాన్‌లో గుర్తించి, చంపడంపై దర్యాప్తు ఎందుకు నిర్వహించ లేదన్న ప్రశ్నకు బదులుగా ఇమ్రాన్‌ ఈ విషయం చెప్పారు. 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాతో చేతులు కలిపి పాక్‌ అతి పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌ గురించే తాను ఎక్కువ ఆందోళన చెందుతున్నానన్నారు

Videos