ఐటీ రిటర్న్ కు రేపే ఆఖరి గడువు

కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్నుల దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని.. రిటర్నులు దాఖలు చేసేందుకు మరో నెల రోజులు (సెప్టెంబర్‌ 30) వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన ఐటీ శాఖ అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేసింది. అవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు రేపటి వరకే ఉందని స్పష్టం చేసింది.

Videos