చివరి బంతితో గట్టెక్కిన టీమ్‌ఇండియా- సిరీస్ 2-1తో ధోనీసేన సొంతం

మూడో ట్వంటీ 20లో భారత్.. జింబాబ్వే పైన కష్టపడి గెలిచింది. తొలుత జింబాబ్వే స్కోరు చూస్తే సులభంగా గెలుస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత మన బౌలర్లు కట్టడి చేశారు. దీంతో భారత్ మూడు పరుగుల తేడాతో గెలిచి 2-1తో సిరీస్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.

ధోనీసేన నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. టాపార్డర్ తడబడ్డా మిడిల్‌లో సిబంద(28), మూర్(26) బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నారు. ఓ దశలో విజయంవైపు సాఫీగా సాగుతున్న జింబాబ్వే ఇన్నింగ్స్‌ను స్రాన్(2/31), కులకర్ణి(2/23) దెబ్బకొట్టారు. వీరి ధాటికి జింబాబ్వే వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుని ఒత్తిడిలో కూరుకుపోయింది. అయితే ఆఖర్లో చిగుంబుర(16), మరుమ(23 నాటౌట్) కడదాకా పోరాడినా అ దృష్టం కలిసిరాలేక ఓటమివైపు నిలిచింది. విజయానికి 21 పరుగులు అవసరమైన దశలో ఆఖరి ఓవర్‌కు దిగిన స్రాన్..తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. అప్పటి వరకు లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకున్న స్రాన్..తొలి బంతికే సిక్స్ సమర్పించుకున్నాడు. అపై ఓ నో బాల్, రెండు ఫోర్లతో జట్టును ఓటమి అంచుల వరకు తీసుకెళ్లాడు. తర్వాత వ్యుహాన్ని మార్చుకుని యార్కర్లతో కట్టడిచేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. అక్షర్‌పటేల్ (1/18), చాహల్(1/32) ఒక్కో వికెట్ దక్కింది.

ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డును ధోనీ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో భారత్ తరఫున మొత్తం 324 మ్యాచుల్లో నాయకత్వం వహించి ధోనీ ఈ రికార్డును అందుకున్నాడు. జింబాబ్వేతో ఆఖరి టీ20 మ్యాచ్ ద్వారా ఈ ఫీట్ సాధ్యమైంది. 2007లో టీమ్‌ఇండియా కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన ధోనీ ఇప్పటి వరకు 60 టెస్టులు, 194 వన్డేలు, 70టీ20 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు.

భారత్:

రాహుల్(బి)మద్జీవ 22, మణ్‌దీప్‌సింగ్(సి)మరుమ(బి)తిరిపానో 4, రాయుడు(సి)చిగుంబుర(బి)క్రెమర్ 20, మనీశ్‌పాండే(రనౌట్/చిగుంబుర) 0, జాదవ్(సి)చిగుంబుర(బి)తిరిపానో 58, ధోనీ(బి)తిరిపానో 9, అక్షర్‌పటేల్ 20నాటౌట్, కులకర్ణి 1నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20ఓవర్లలో 138/6; వికెట్ల పతనం: 1-20, 2-27, 3-27, 4-76, 5-93, 6-122; బౌలింగ్: చతార 4-1-34-0, తిరిపానో 4-0-20-3, మద్జీవ 4-0-32-1, చిభాభ 4-0-19-0, క్రెమర్ 4-0-32-1.

జింబాబ్వే:

చిభాభ (సి)చాహల్(బి)స్రాన్ 5, మసకద్జ(ఎల్బీ)(బి)పటేల్ 15, సిబంద (ఎల్బీ)(బి)కులకర్ణి 28, మూర్(సి)మణ్‌దీప్(బి)చాహల్ 26,
వాలర్(సి)బుమ్రా(బి)కులకర్ణి 10, చిగుంబుర(సి)చాహల్(బి)స్రాన్ 16, మరుమ 23 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 135/6; వికెట్ల పతనం: 1-17, 2-57, 3-60, 4-86, 5-104, 6-135; బౌలింగ్: స్రాన్ 4-1-31-2, కులకర్ణి 4-0-23-2, బుమ్రా 4-0-23-0, అక్షర్‌పటేల్ 4-0-18-1, చాహల్ 4-0-32-1.

Videos

Leave a Reply

Your email address will not be published.