భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ

భారత్ చైనా మధ్య మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. అయితే ఉన్నతాధికారుల చర్చల్తో ఒక రోజులోనే సమస్య సద్దుమణిగినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. విషయానికి వస్తే లధఖ్ లోని సరిహద్దు ప్రాంతంలో భారత్ చైనా పరస్పరం తలపడ్డాయి. తూర్పు లధఖ్ లోని పాంగాంగ్ సొ సరస్సు సమీపంలో భారత జవాన్లు పెట్రోలింగ్ చేస్తుండగా చైనా సైనికులు అడ్డుకున్నారు. టిబెట్-లద్ధఖ్ఖ్ భూభాగాల మధ్యలో ఉన్న ఈ సరస్సు మూడోవంతు చైనా అధీనంలో ఉంది. అయితే భారత భూభాగంలో ఉన్న సరస్సు వెంబడి జవాన్లు పెట్రోలింగ్ చేస్తుండగా చైనా సైనికులు అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కొంతసేపు ప్రతిష్టంభన నెలకొంది. బుధవారం ఉదయ నుండి ఆ రోజు మొత్తం ఇరుదేశాల సాయినుకులు పరస్పరం తలపడుతూ, తోపులాటకు దిగారు. సాయంత్రానికి ప్రోటోకాల్ ప్రకారం బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరపడంతో ఈ ఉద్రికతకు తెరపడింది.

Videos