జింబాబ్వేపై మరో గెలుపు: వన్డే సిరిస్ భారత్‌దే

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో ధోని సేన 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-0 తేడాతో గెలుపొందింది. జింబాబ్వే విసిరిన 127 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 26.5 ఓవర్లలో ఛేదించింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(33;50 బంతుల్లో 4 ఫోర్లు), కరుణ్ నాయర్(39 ;68 బంతుల్లో 5 ఫోర్లు), అంబటి రాయుడు(41 నాటౌట్; 44  బంతుల్లో 7 ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత విజయానికి రెండు పరుగుల దూరంలో ఉండగా నాయర్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఈ తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన మనీష్ పాండే ఫోర్ కొట్టి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

మ్యాచ్ ప్రారంభం నుంచే భారత బౌలర్లు జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించారు. భారత బౌలర్లలో చాహాల్ 3, బలీందర్ శ్రణ్, కులకర్ణి చెరో రెండు వికెట్లు తీసుకోగా, తొలి వన్డేలో రాణించిన బుమ్రా, అక్షర పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత బౌలర్లు ధాటికి జింబాబ్వే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. సిబందా 53, చిబాబా 21 పరుగులు మినహా మరే ఆటగాడూ చెప్పుకోతగ్గ స్కోరు చేయక పోవడం విశేషం. మసకజ్జా 9, మూర్ 1, రజా 16, చిగుంబరా 0, ముతుంబావి 2 పరుగులకు అవుటయ్యారు. 34 ఓవర్ల ముగిసే సరికే 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. 107 పరుగులకే 6 వికెట్లు పీకల్లోతు కష్టాల్లో ఉంది.

జింబాబ్వే స్కోరు 30.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు. బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 15 ఓవర్లకు గాను మూడు వికెట్లను కోల్పోయి 61 పరుగులు చేసింది. భారత బౌలర్లు వేస్తున్న బంతులను ఎదుర్కొనడంలో జింబాబ్వే బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జింబాబ్వే ఇన్నింగ్స్ టెస్టు ఇన్నింగ్స్‌ను తలపిస్తోంది. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ మసకజ్జా, 1 పరుగు చేసిన పీటర్ మూర్ పెవీలియన్‌కు పంపడంలో జింబాబ్వే వికెట్ల పతనం ప్రారంభమైంది. జింబాబ్వే స్కోరు 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు. తొలుత టాస్ గెలిచిన గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో జింబాబ్వేపై టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండో వన్డేలో పూర్తి ఆత్మవిశ్వాసంతో టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు సొంతగడ్డపై జింబాబ్వే విఫలమవడం ఆ జట్టు సభ్యులను తీవ్రంగా వేధిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరిస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉంది. భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు. కానీ జింబాబ్వే మాత్రం జట్టులో ఒక మార్పు చేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్వాం 12.30 గంటలకు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. జట్ల వివరాలు: ఇండియా: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్‌దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్ జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్‌మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *