ఇండియన్ ఆఫ్ ద ఇయర్” అవార్డు అందుకున్న రాజమౌళి

“కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడు” ఈ ప్రశ్న దాదాపు ఏడాదిగా దేశవ్యాప్తంగా కోట్లాది మందిని తొలిచేస్తోంది. బాహుబలి టీమ్ సభ్యుల్లో ఎవరిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వట్లేదు. రాజమౌళి సైతం ఏ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న వచ్చినా సమాధానం దాటవేసేస్తున్నాడు. నవ్వేసి ఊరుకుంటున్నాడు. చివరికి గురువారం ఢిల్లీలో “సీఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్” అవార్డు అందుకున్న టైంలో అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖల మధ్య కూడా రాజమౌళికి ఈ ప్రశ్న ఎదురైంది. ఈ అవార్డు అందుకుని రాజమౌళి మాట్లాడిన అనంతరం.. ప్రముఖ విమర్శకుడైన రాజీవ్ మసంద్ ఇక్కడున్న అందరి తరఫున మీకో ప్రశ్న అంటూ మొదలుపెట్టాడు.

రాజమౌళి ముందే పసిగట్టేసి ముసి ముసి నవ్వులు నవ్వుతుండగా.. “కట్టప్పానే బాహుబలికో క్యూ మారా” అని అడిగాడు రాజీవ్ మసంద్. ఈ ప్రశ్నకు తాను కచ్చితంగా సమాధానం చెప్పలేనని.. అక్కడ తన నిర్మాతలు తనవైపు గన్స్ పెట్టి రెడీగా ఉన్నారని.. జవాబు చెప్పగానే తన పనైపోతుందని చెప్పి.. వచ్చే ఏడాది ఏప్రిల్ అవరకు ఆగమన్నాడు రాజమౌళి.
అంతకుముందు అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ముందు తెలుగులో నమస్కారం అన్నాడు. తర్వాత.. “నేను ఎప్పుడూ కెమెరాలు, లైట్లే జీవితంగా గడుపుతుంటాను. కానీ వాటి ఎదురుగా నేనుంటే మాత్రం చాలా కంగారుగా ఉంటుంది. ఈ అవార్డు విషయంలో ఓ కంప్లైంట్ ఉంది. ఇది నా ఒక్కడికి కాకుండా బాహుబలి టీం మొత్తానికి దక్కి ఉంటే చాలా సంతోషించేవాడిని. ఎందుకంటే ఇది టీం వర్క్ వల్ల సాధ్యమైన సినిమా. కాబట్టి ఇది మొత్తం నా టీం అంతటికీ దక్కిన అవార్డుగా భావిస్తున్నా” అన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published.