నంద్యాలపై ఇంటెలిజెన్స్ సర్వే: విజయం ఎవరిది?

నంద్యాల ఫలితం పై కేవలం రాష్ట్ర లెవల్లోనే కాదు.. సెంట్రల్ లెవల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఒకరకంగా బీజేపీకి కూడా నంద్యాల ఫలితం ఇంపార్టెంటే. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలా లేక మరో మార్గాన్ని ఎంచుకోవాలా? అనే అంశం గురించి నిర్ణయించుకోవడానికి కమలం కూడా నంద్యాల ఫలితాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశాలున్నాయి. మరి ఫలితం వచ్చే వరకూ ఆసక్తిని ఆపుకోలేక.. ఎవరు గెలుస్తారు అనే అంశం గురించి కూడా కేంద్రం ఆధ్వర్యంలో సర్వేలు జరిగినట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే  ఫలితం ఒకటి ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. మరి దీని కథేమిటంటే.. నంద్యాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఆరు వేల ఓట్ల మెజారిటీ దక్కే అవకాశం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ తేల్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. నంద్యాల్లో పోటాపోటీ వాతావరణం ఉందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితి గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధ్యయనం చేసిందని.. విజయం వైకాపాదే , మెజారిటీ కనీసం ఆరు వేల ఓట్లు.. అని తేల్చిందట.

మరి ఇది తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశమే. నంద్యాల్లో గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పుడు ఓడిపోతే.. భవిష్యత్తు ప్రశ్నార్థకమే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు విజయం కోసం రెండున్నర నెల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇంత జేసినా ఓటమి తప్పదనే సంకేతాలు గోచరిస్తున్నాయి. తెలుగుదేశాన్ని టెన్షన్ పెడుతోంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *