ఐఫోన్ 6, 6 ప్ల‌స్‌పై నిషేధం

ఆపిల్ సంస్థ‌కు చెందిన ఐఫోన్ 6, 6 ప్ల‌స్‌ మోడ‌ళ్ల‌పై చైనా కోర్టు నిషేధం విధించింది. షెంజ‌న్ బెల్లీకి చెందిన కంపెనీ త‌యారు చేసే 100సీ మోడ‌ల్ ఫోన్ల త‌ర‌హాలోనే ఐఫోన్ 6, 6 ప్ల‌స్‌ ఉన్న కార‌ణంగా వాటిని అమ్మ‌రాద‌ని బీజింగ్ ట్రిబ్యున‌ల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐఫోన్‌కు చెందిన రెండు వ‌ర్ష‌న్లు స్థానిక కంపెనీ ఫోన్ల త‌ర‌హాలో ఒకే మాదిరిగా ఉన్నాయ‌ని, అందుకే వాటిని చైనాలో అమ్మ‌రాద‌ని బీజింగ్ కోర్టు త‌న తీర్పులో స్ప‌ష్టం చేసింది. ఈ ఆదేశాల‌ను మే నెల‌లోనే జారీ చేసినా ఇటీవ‌లే ఆ విష‌యం మీడియాకు చిక్కింది. అయితే ఫోన్ల డిజైన్ కేసులో ట్రిబ్యున‌ల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై బీజింగ్‌లోని ఉన్న‌త కోర్టు స్టే విధించింద‌ని, ఇప్పుడు అక్క‌డ ఐఫోన్ల‌ను అమ్ముతున్న‌ట్లు ఆపిల్ సంస్థ తెలిపింది.
221

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *