రేటు తగ్గిన ఐఫోన్ 6ఎస్

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు ఫోన్లలో ఐఫోన్లు వేరు. ఎందుకంటే ఐఫోన్లకు ఉన్నంత క్రేజ్ వేటికీ లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న యాపిల్ ఐఫోన్లు భారత మార్కెట్లో మాత్రం తక్కువ ధరకే వస్తున్నాయి. అవును బయటి కంటే కూడా భారత మార్కెట్ లోనే ఐఫోన్ రేట్ తక్కువగా అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ కొత్తగా లాంఛ్ చేసిన ఐఫోన్ 6 ఎస్ రేట్ బయటి మార్కెట్ కంటే కూడా ఈ కామర్స్ సైట్లు తక్కువ రేటుకు అందుబాటులో ఉంచాయి. దాదాపుగా 20 శాతం తక్కువకు ఐఫోన్ 6ఎస్ అందుబాటులోకి రావడం జరిగింది. కాగా ఒక్కో ఈ కామర్స్ సైట్ ఒక్కో రేట్ కు అమ్ముతున్నా కానీ మొత్తానికి బారీగా రేట్ తగ్గింది అని మాత్రం చెప్పవచ్చు.

యాపిల్ కంపెనీ 64 జీబీ ఐఫోన్‌-6ఎస్‌ను లాంచ్‌ చేసిన సమయంలో దీని ధర అక్షరాల 62వేలు. ఇప్పుడు గోల్డ్ కలర్ ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్ కేవలం 44,799లకే అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంటే ఈ మోడల్‌ ధర 27శాతం తగ్గింది. ఇక 64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో 72వేలు ఉండగా.. ఇప్పుడు అది 57,699కే లభిస్తోంది. పేటీఎంలోనూ ఐఫోన్‌ 6ఎస్‌ తక్కువ ధరకు లభిస్తున్నది. 6ఎస్‌ 128 జీబీ మోడల్ వాస్తవ ధర 82వేలు కాగా.. 20శాతం డిస్కౌంట్‌ తో 65,490లకే ఈ ఫోన్‌ లభిస్తున్నది. పేటీఎంలో ఐఫోన్‌ 6ఎస్‌ 64 జీబీ బేస్ మోడల్‌ రూ. 66,489కి లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్‌ 49,999కి లభిస్తున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *