చక్కర్లు కొడుతున్న ఐఫోన్8 ఫీచర్స్

ఆపిల్ కొత్త ఫోన్ ఐఫోన్7 ఇలా వచ్చిందో లేదో.. అప్పుడే ఐఫోన్8పై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత వచ్చే ఐఫోన్ ఎలా ఉండబోతుందో అప్పుడే టెక్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వచ్చే ఏడాది ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుందట. ఈ వార్షికోత్సవం సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలని ఆపిల్ ప్లాన్ చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త డిజైన్‌లో ఐఫోన్8 లాంచ్ చేస్తుందని, వాటిలో పొందుపరిచే ఫీచర్లు చాలామటుకు కొత్తగా ఉండబోతున్నాయని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
తాజా రూమర్ ప్రకారం తర్వాత వచ్చే ఐఫోన్లో పిజికల్ హోమ్ బటన్ ఆపిల్ తొలగిస్తుందట. ఇప్పటికే ఐఫోన్7లో ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఓ వర్చ్యువల్ బటన్‌ను ఆపిల్ పొందుపరిచింది. దీంతో వచ్చే ఐఫోన్8లో పూర్తిగా హోమ్ బటన్ తీసివేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తుందట. అలాగే ఈ ఫోన్ 5 అంగుళాల స్కీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.  తాజాగా విడుదల చేసిన ఐఫోన్7 స్క్రీన్ 4.7 అంగుళాలు కాగ, పెద్ద వెర్షన్ ఐఫోన్7 ప్లస్ స్క్రీన్ 5.5 అంగుళాలు.
కొత్త రూమర్ల ప్రకారం ఐఫోన్ 8 మూడు స్క్రీన్ సైజుల్లో మార్కెట్లోకి అడుగు పెడుతుందట.  అవి 4.7 అంగుళాలు, 5 అంగుళాలు, 5.5 అంగుళాలుగా ఉండబోతున్నాయని సమాచారం. ఆపిల్ న్యూస్‌లను ఎప్పడికప్పుడూ అప్డేట్గా పేర్కొనే ఇన్సైడర్లు మాత్రం ఈ రూమర్లను ఖండిస్తున్నారు. ఎప్పుడూరెండు సైజుల ఫోన్లనే విడుదలచేసే ట్రెండ్‌ను ఆపిల్ అలానే ఫాలోఅవుతుందని పేర్కొంటున్నారు. గత రిపోర్టుల ముందస్తు సూచనల ప్రకారం ఐఫోన్8 ఓలెడ్ డిస్ప్లేను కలిగి,  అల్యూమినియంకు బదులు మొత్తం గ్లాస్‌తో డిజైన్ చేస్తున్నారని తెలిసింది.  ఐఫోన్7 ముందే ఈ విషయాన్ని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది తీసుకొచ్చే ఐఫోనే, అల్యూమినియం బాడీతో రూపొందే చివరి ఫోన్ అని పేర్కొన్నాయి.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *