ఐఫోన్ ఎస్‌ఈ – నెలకు రూ.999

ఇండియన్ కార్పొరేట్ కస్టమర్ల కోసం ఆపిల్ కంప్యూటర్స్ వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈమధ్యే మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 4 అంగుళాల ఐఫోన్ ఎస్‌ఈతోపాటు ఇతర మోడళ్లను లీజుకివ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు నెలకు రూ.999 అద్దె చెల్లించడం ద్వారా రెండేండ్ల కాలానికి ఐఫోన్ ఎస్‌ఈని లీజుకు తీసుకోవచ్చు. అదే ఐఫోన్ 6 లీజుకోసం నెలకు రూ.1,199 చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 6ఎస్ మోడల్‌పై నెలవారీ అద్దెను రూ.1,399గా నిర్ణయించారు. కావాలంటే కస్టమర్లు ఐఫోన్‌కు చెందిన ఒక మోడల్ నుంచి మరొక మోడల్‌ను మారొచ్చు. కొత్తగా తీసుకున్న మోడల్‌కు వర్తించే అద్దె చెల్లిస్తే సరిపోతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *