పూరి-హరికృష్ణ.. రెండు పావురాల కథ

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇజం’. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సినిమా బిగ్ సీడీని నంద‌మూరి హ‌రికృష్ణ విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ ఆడియో సీడీల‌ను అందుకున్నారు.

త‌న యాక్టింగ్ చూసి చాలా గ‌ర్వంగా అనిపించింది : పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ “ఇజ‌మ్ టీజ‌ర్ హ‌రికృష్ణ‌గారికి న‌చ్చి నాకు రెండు పావురాల‌ను ఇచ్చారు. అవి గుడ్లు కూడా పెట్టాయి. టీజ‌ర్ చూసి ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అని అన్నారు. మూడు నెల‌ల్లో క‌ల్యాణ్‌రామ్ 30 కిలోలు త‌గ్గారు. అది మామూలు విష‌యం కాదు. త‌న యాక్టింగ్ చూసి చాలా గ‌ర్వంగా అనిపించింది. త‌ప్ప‌కుండా చూసిన వాళ్లంద‌రూ కూడా అది ఫీల‌వుతారు. కోర్టు సీనుల‌న్నీ నంద‌మూరి వారి అకౌంట్‌లోనే ఉన్నాయి. ఈ సినిమాలోనూ ఓ కోర్టు సీను ఉంది. చాలా బాగా చేశాడు. ఆ సీను చూసి తార‌క్ యాహూ అని అరిచాడు. అనూప్ నాకు ఈ సినిమాలో ఓ పాట‌ను రాసే , పాడే అవ‌కాశాన్నిచ్చాడు. పాట రాయ‌డం ఎంత క‌ష్ట‌మో అర్థ‌మైంది. దానికి బ‌దులు ఓ క‌థ రాసుకోవ‌చ్చ‌నిపించింది. “ అని చెప్పారు.

జగన్ అంటే నాకెందుకు ఇష్టం? -ఎన్టీఆర్
నిజానికి దర్శకుడు పూరి జగన్ అంటే చాలామంది స్టార్ హీరోలకు బాగా ఇష్టం. ఎందుకంటే మనోడు ఒక్కసారిగా హీరోలకు ఎక్కడాలేని కొత్త యాటిట్యూడ్ ను చేరుస్తాడు. వారిలో ఎనర్జీ నింపేస్తాడు. ఇడియట్ లో రవితేజ.. పోకిరిలో మహేష్.. బుజ్జిగాడులో ప్రభాస్.. హార్ట్ ఎటాక్ లో నితిన్.. ఇలా పూరి హీరోలందరూ రెచ్చిపోతారు అంతే. తరువాత టెంపర్ లో ఎన్టీఆర్ ను సైతం న్యూ డైమన్షన్ లో ఆవిష్కరించాడు. ఇదంతా చెప్పిన తరువాత కూడా అసలు ఎన్టీఆర్ కు పూరి జగన్ అంటే ఎందుకిష్టమో వేరే చెప్పాలంటారా? అలా అయితే ఎన్టీఆర్ ఆన్సర్ వినుకోండి.

”నా కెరియర్ అనేది.. టెంపర్ సినిమాకు ముందు.. టెంపర్ తరువాత అంటూ మార్చేశాడు పూరి జగన్ భయ్యా. ఆ సినిమా చేసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చేసింది. ప్రతీ విషయాన్ని డిఫరెంట్ గా చూడటం నేర్చుకున్నాను. అందుకే నాకు పూరి భయ్యా అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు కళ్యాణ్ రామ్ అన్న జగన్ గారితో పనిచేస్తే.. ఆయన ఒక కొత్త కోణంలో కనిపిస్తారని నాకు ఆశ ఉండేది. ఇప్పటికి ఆ ఆశ తీరింది. అన్న లుక్ అదిరిపోయింది. లుక్ అంటే కండలూ అవీ కాదు. యాటిట్యుడ్” అంటున్నాడు యంగ్ టైగర్. పూరి డైరక్షన్లో ఎవరు చేసినా కూడా మారిపోతారట. అదిగో కళ్యాణ్ రామ్ కూడా ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపిస్తున్నాడట. అట ఏముంది.. నిజంగానే కొత్తగా ఉన్నాడు. అదరగొట్టేశాడు.

హరి కృష్ణ మాట్లాడుతూ… హ‌రికృష్ణ మాట్లాడుతూ “ఇపుడు నా వ‌య‌సు 60. ఈ జీవితంలో ఎవ‌రూ పొంద‌లేని, అనుభ‌వించ‌లేని ఆనంద స‌మ‌యాల‌ను చూశాను. నంద‌మూరి రామారావు గారి ద‌గ్గ‌ర 30 ఏళ్లు ప‌నిచేశా. ఆయ‌న‌తో నాకున్న అనుభ‌వాలు హిమాల‌య శిఖ‌రాల‌ను మించాయి. సినిమా రంగంలో ఆయ‌న‌తో ఎన్నో విజ‌యాలు చూశాను. రాజ‌కీయాల్లో పార్టీ పెట్టి పోరాటం చేసి గెలిచాం. వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానులు ఇవాళ మా సొంతం. ఎవ‌రూ త‌స్క‌రించ‌లేనిది అభిమానం. ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌లు నా బిడ్డ‌ల‌కు ఆ అభిమానాన్ని పంచుతున్నారు. నా 59వ ఏట జూనియ‌ర్ టెంప‌ర్ హిట్ ఇచ్చాడు. క‌ల్యాణ్‌రామ్ ప‌టాస్ ఇచ్చాడు. నా 60వ ఏట జూనియ‌ర్ జ‌న‌తాగ్యారేజ్ హిట్ ఇచ్చాడు. క‌ల్యాణ్ ఇప్పుడు ఇజంతో ముందుకు రాబోతున్నాడు. హిట్ కొడ‌తాడ‌నే న‌మ్మ‌కం ఉంది. మా నాన్న క‌డుపున పుట్ట‌డ‌మే నేను చేసుకున్న మ‌హ‌ద్భాగ్యం. ఆయ‌న ఆశీస్సులు పిల్ల‌ల‌కున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట‌ను నా ఇద్ద‌రు పిల్ల‌లూ గుర్తుంచుకున్నారు. అన్నారు.

పూరి బూతులు కూడా అందంగా చెబుతారు; ప్ర‌కాష్‌రాజ్ మాట్లాడుతూ “అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. రీరికార్డింగ్‌లోనూ నాకు రాజాగారిని గుర్తుచేస్తాడు. `ఇజం` చూస్తుంటే కళ్యాణ్ రామ్ లో ఉన్న ఆక‌లి తెలుస్తోంది. నాలాంటి న‌టుల‌కు ఆ ఆక‌లి అర్థ‌మ‌వుతుంది. వండ‌ర్‌ఫుల్‌గా చేశాడు. గొప్ప కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి అత‌ను. అయినా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఆయ‌న ప‌డే త‌ప‌న నాకు తెలుసు. ఎన్టీఆర్ నా దృష్టిలో జెన్యూన్ ఆర్టిస్ట్. నాకు పూరి ఆక‌లి తెలుసు. విజ‌న్ తెలుసు. క‌ల్యాణ్ సినిమా ఏమాత్రం బావున్నా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది. జ‌గ్గు ఈజ్ ఎ స్ట్రీక్‌. పూరి బూతులను కూడా అందంగా చెబుతారు. అది కూడా తమలోని భావాలను ఎక్స్ ప్రెష్ చేసే భాష అని ఆయన ఎంతో బాగా చెబుతారు. అన్నిట్లోనూ పూరి ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటారు. మాస్‌కి క్లాస్ ట‌చ్ ఇవ్వ‌గ‌ల ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఎడిటింగ్ ప్యాట‌ర్న్స్ నుంచి ఆయ‌న‌కు అన్నీ తెలుసు అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.