కొత్తగా ట్రై చేసాడు‌:ఇది నందమూరి ‘ఇజం’ (వీడియో)

ఎపి, తెలంగాణా బాక్స్‌ఆఫీస్ ల వద్ద దుమ్మురేపుతున్న జనతా గ్యారేజ్ చేస్తున్న చూసి ఆనందపడుతున్న నందమూరి అభిమానులకు హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో కానుక అందించారు. కళ్యాణ్‌రామ్‌ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇజం’ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్టు పాత్రలో, సిక్స్‌ప్యాక్‌తో కనిపించనున్నారు. 2015లో మిస్‌ ఇండియా కిరీటం గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

సోషల్ మీడియాలో టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. టీజర్‌ను చూస్తే బట్టి చూస్తే సినిమా పక్కా మాస్, యాక్సన్ ఓరియెంటెడ్‌లా, పూరీ జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనబడటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ పక్కా మాస్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని పూరీ జగనాథ్ డైరెక్ట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.