చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోన్న ఇస్రో!

పూర్తి స్వదేశీ సాంకేతిక సహకారంలో ఇప్పటికే క్రయోజెనిక్ ఇంజన్ వినియోగంతో సరికోత్త అద్యాయాలను తన పేరున లిఖించుకుంటూ ముందుకు దుసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) మరో కొత్త చరిత్రను సృష్టించేందుకు రంగం సిద్దం చేసింది. అగ్రరాజ్యాలు – గొప్ప దేశాలు అని చెప్పుకునే ఏ దేశమూ ఇప్పటివరకూ చేయని అరుదైన కార్యక్రమాన్నికి ఇస్రో నడుం చుట్టింది. ఈ అరుదైన చారిత్రాత్మకమైన సంఘటనకు ముహూర్తం వచ్చే ఏడాది జనవరి 15న జరగబోతోంది.

విషయానికొస్తే… ఇప్పటివరకూ ఏ దేశం ప్రయోగించిన రీతిలో 82 ఉపగ్రహాలను ఒకేసారి శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా కక్ష్యలోకి పంపేందుకు సమాయత్తం అవుతుంది ఇస్రో. వీటిలో 60 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవి 20 యూరప్ కు చెందినవీ కాగా మిగిలిన 2 ఉపగ్రహాలు యూకోలో తయారైనవి. ఇది ఇస్రో చరిత్రలోనే అతి పెద్ద టాస్క్ గా కనిపిస్తోంది. ఈ ప్రయోగం జరిగిన 20 నుంచి 25 నిమిషాల్లో 580 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్ష్యలో 82 శాటిలైట్లను ప్రవేశపెట్టేంత వరకు దానిని అక్కడే అగేలా చేయడమే తమకు ఈ ప్రయోగంలో ఏర్పడనున్న ప్రధాన సవాల్ అని మామ్ ప్రయోగపరిశోధన డైరెక్టర్ గా వ్యవహరించిన సుబయ్య అరుణన్ చెబుతున్నారు. ఈ ప్రయోగం అనంతరం మరళా 2020లో మామ్-2ను ప్రయోగించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలను అందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ ఎల్వీ)తోనే ఈ 82 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.

అయితే ప్రపంచ దేశాలలో కేవలం రష్యా మాత్రమే ఇప్పటివరకూ 37 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపి అత్యదిక ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపిన దేశంగా చరిత్ర సృష్టించగా.. తాజాగా ఇస్రో దానిని బద్దలు కోట్టి ఆ ఉపగ్రహాలకు రెట్టింపుకు పైగా ఉపగ్రహాలను పంపి తన పేరున నూతన అద్యాయం లిఖించుకునేందుకు సిద్దమైంది. 19 జూన్ 2014లో రష్యా 37 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగా.. అంతకుముందు అగ్రరాజ్యం అమెరికా 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఇదే క్రమంలో గతంలో ఒక ప్రయోగంలోనే 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో! ఆ లెక్కన పాత రికార్డుల్లో అతి స్వల్ప తేడాతో మూడో స్థానంలో నిలిచిన భారత్… ఈ సారి ఏకంగా 82 ఉపగ్రహాలను పంపేందుకు సన్నధం అవుతుంది. తద్వారా సరికొత్త చరిత్రను లిఖించబోతోంది!!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *