విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభ్యం: ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-2 ప్రయోగంలో పురోగతిని సాధించింది.చంద్రయాన్‌–2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ను గుర్తించామని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్‌’కు సంబంధించిన థర్మల్‌ ఇమేజ్‌లను చిత్రీకరించాయని వెల్లడించారు. ఈ చిత్రాలను చూస్తే విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ అయినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ కేంద్రంలో శివన్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ల్యాండర్ తో సంబంధాలకు ప్ర్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ల్యాండర్ తో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Videos