ఐటీకి కొత్త ఉద్యోగాలు వచ్చే చాన్సే లేదా?

మేథో వలసలు విదేశీ కొలువులపై ఆధారపడి ఉన్న వారికి మరో దుర్వార్త. ముఖ్యంగా ఐటీ రంగంపై ఆధారపడి ఉన్న వారికి పిడుగు లాంటి విశ్లేషణ. అదేందంటే…ఉద్యోగాలు కల్పించడంలో టాప్లో నిలిచే ఐటీ రంగంలోనే గత రెండు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని తేలుతోంది. కొన్ని కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేయగా కొన్ని కంపెనీలు చాలా తక్కువ మందిని నియమించుకుంటుండటం ఇందుకు కారణం. సహజంగానే ఈ పరిణామం ఐటీ ఆశావహులకు ఇబ్బందికరమని అంటున్నారు. అమెరికా హెచ్ 1 బీ వీసాలను కఠినతరం చేయడం ఆస్ట్రేలియా 457 వీసాలను రద్దు చేయడంతో ఇప్పటికే కలత చెందుతుండగా…తాజా పరిణామం షాక్ వంటిదని పేర్కొంటున్నారు.

అమెరికా సహా ఇతర దేశాల్లో చోటు చేసుకుంటున్న స్థానికులకే ఉద్యోగాలు అనే ట్రెండ్ కారణంగా అక్కడి నుంచి భారత్కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయిందట. ఏకంగా పదింతలు ఈ సంఖ్య పెరిగిందని ‘డిలైటీ టచే తోయిమస్త్సు ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న భారతీయుల్లో 60 శాతం ఉద్యోగులు భవిష్యత్తులో పనికి రాకుండాపోయే ప్రమాదం ఉందని ‘మెకిన్సే అండ్ కంపెనీ’ వెల్లడించింది. అంటే కొత్త ఉద్యోగాల కంటే ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువన్న మాట. ఈ పరిణామం ఇప్పుడు ఐటీ ఉద్యోగార్థుల్లో కలవరపాటుకు కారణం అయింది.

మనదేశంలో ఉద్యోగాల కల్పన ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.  దేశంలో ప్రస్తుతం ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దేశంలో దాదాపు 26 కోట్ల మంది ఉన్నారు. గతేడాది గణాంకాల ప్రకారం దేశంలో 1.70 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. 2028 వరకు దాదాపు 35 కోట్ల కొత్త ఉద్యోగాలు కావాలని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 11 ఏళ్లలో ఏడాదికి మూడు కోట్ల చొప్పున కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. అప్పుడే నిరుద్యోగం సమస్య తీరుతుంది. ఈ కఠినమైన టాస్క్కు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సిద్ధమవుతుందనేది అందరిలోనూ నెలకొన్న సందేహం.

Videos

Leave a Reply

Your email address will not be published.