రిషికేష్‌లో పూజలు చేసిన జగన్‌

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రం మనసు మారాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వైసిపి అధినేత వైఎస్.జగన్మోహన్‌ రెడ్డి రిషికేష్‌లో  ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న జగన్‌, ఏపీకి మంచి జరగాలని పూజలు చేశారు. ఉదయం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ చేరుకున్న జగన్, అక్కడి నుంచి రిషికేష్‌ వెళ్లారు

వైఎస్ జగన్ తోపాటు ఎంపీలు అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. హోమానికి ముందు వైఎస్ జగన్.. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు. నదీమతల్లికి హారతి ఇచ్చారు. వస్రాలు సమర్పించారు. పూజలు నిర్వహించారు. పవిత్ర స్నానం ఆచరించాక.. చాతుర్మాస దీక్ష హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో దాదాపు మూడు గంటలపాటు ఈ పవిత్ర కార్యక్రమంలో వైఎస్ జగన్ పాలుపంచుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.